Saturday, February 23, 2019

అంబ: 120 కోట్ల భారతం ఏది చూడాలో ఏది చూడకూడదో నిర్ణయించే అధికారం నాకు కావాలి
పీ.యస్: ఏం చెద్దాం? జనాలు చూసే కేబుల్ టీ.వీ లు మన కంట్రోల్ లో తెచ్చుకుందామా?
అంబ: అది తరువాత. జనం ఎక్కడికెళ్తే అక్కడికి టి.వి. లు మోసుకెళ్ళరు. వాళ్ళతో ఎప్పుడు వుండేది సెల్ ఒక్కటే. ముందు దాని సంగతి చూద్దాం.
పీ.యస్: కానీ మనకి చాల మంది ఆపరేటర్లు వున్నారు కదా..
అంబ: నాకు పోటీ నచ్చదు. కాంపిటీషన్ చచ్చిపోవాలి. ఫ్రీ 3 నెలలు ఫ్రీ.
పీ.యస్: వాళ్ళ చేతుల్లోకి సెల్ వెళ్తే మన మనకి ఒరిగేది ఏంటి?
అంబ: ఇంటర్నెట్ ఫ్రీ. పిల్లా పెద్దా ముసలి ముతక నెట్ లో దొరికే ఏంటర్టైన్మెంట్ మీడియాకి బానిసలు ఐపోవాలి. (https://timesofindia.indiatimes.com/…/articles…/64432913.cms)
అంబ: అది జస్ట్ గ్రౌండ్ అంతే. ప్రైం, నెట్ ఫ్లిక్స్ తరహా లో ఇంటర్నెట్ ఆధారిత మీడియా ప్లాట్ ఫాం మనం పెట్టాలి. సినిమాలు నిర్మించాలి.
(https://www.jiocinema.com/
https://variety.com/…/mukesh-ambani-reliance-industries-ta…/)
పీ.యస్: సరే కాంపిటీషన్ చచ్చి సెల్ మార్కెట్ మన చేతిలోకి వచ్చిందే అనుకుందాం. మరి టీ.వీ లను ఎలా కంట్రోల్ చేస్తాం? జనాలు డి.టీ.హెచ్ చాలా తక్కువ వాడుతున్నారు కదా.

అంబ: క్వాలిటీ వున్న సరే జనాలు డీ.టీ.హెచ్ ఎందుకు వాడట్లేదు?
పీ.యస్: 200 / 250 కి కేబుల్ లో అన్ని చానల్స్ వస్తుంటే జనాలు డీ.టీ.హెచ్ ఎందుకు వాడతారు?
అంబ: అందుకే ప్రతి చానల్ కి డబ్బులు పెట్టి కొనుక్కునే ఒక రూల్ రావాలి. అప్పుడు కేబుల్ డీ.టీ.హెచ్ ఒకే రేట్ కి వస్తాయ్. అప్పుడు మనం మన డీ.టీ.హెచ్ బాక్సుల్ని ఇంటర్నెట్ తో సహా భీబత్సమైన ఆఫర్లతో దింపుతాం. కొద్ది రోజులకి కేబుల్ కి కాలం మూడుతుంది. (https://jio.services/jio-dth/)
పీ.యస్: తరువాత?
అంబ: ఏముంది. నాకు నచ్చిన రూల్స్ పెట్టుకుని కాంపిటీషన్ చంపుతా లేదంటె సాధ్యమైనంత వరకూ తగ్గిస్తా. ఒక సారి మార్కెట్ మేజర్ షేర్ నాది అనుకున్న తరువాత చానళ్ళతో గేం మొదలైతే ఎలా వుంటుందంటావ్? నా మాట వినే చానల్ మాత్రమే ప్రసారమవ్వాలి. నేను చెప్పిందే టెలికాస్ట్ అవాలి.
పీ.యస్: ఇలానే అనుకుంటే నెట్ న్యూట్రలిటీ మీద పెద్ద యుద్ధం జరిగి గూగుల్ ఫేస్బుక్ కలలు కల్లలైయ్యాయి.
అంబ: వాళ్ళకి గేం సరిగ్గా ఆడడం రాలేదు. నేను గేం ఆడడం మొదలెట్టి 3 ఏళ్ళైయాయి ఎవరికన్న అర్ధం ఐయ్యిందా?
అప్పటికీ టీ.వీ, ఫోన్ ఇంటర్నెట్ అంతా మన కంట్రొల్ లోనే వుంటుంది.
పీ.యస్: మహానుభావులు.
అంబ: చేసేది ఎలాంటి పని ఐనా మనకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేకుండ చేస్తే చచ్చినట్టు భరిస్తారు అంతేనా?
భక్తులు: అంతేగా అంతేగా.. జై మేడ్ ఇన్ ఇండియా

ఎంత సముదాయించుకున్నా లాస్ట్ స్టెప్ నిజం ఐతే ఏంటన్న ఊహే నన్ను భయపెడుతుంది

No comments: