Friday, November 28, 2008

సామాన్యుడి ప్రశ్న....!!!

నేను కథ రాయాలని అనుకుంటున్నాను .. ప్రతి కథ కి ఒక ముగింపు వుంటుందంటారు కాని నేను ఒక ముగింపు లేని కథ ని మొదలు పెడుతున్నాను ..ఎన్నో కారణాలు నాకు ఈ కథ కి స్ఫూర్తి ని ఇచ్చాయి..
మన కథ లొ మొదటి భాగం "రక్తం కురిసిన రాత్రి" --->
అనగా అనగా ఒక దేశం..
ఆ దేశం లో జనాభా ఎక్కువ కాని ఆ జనం లో జాగృతి తక్కువ ...
నాయకులూ ఎక్కువ కాని వారికి నీతి తక్కువ..
ప్రజలకు హక్కులు ఎక్కువ ..బాధ్యతలు తక్కువ
ఇన్ని గొప్ప గుణాలు కలిగిన ఆ దేశానికి చలా పెద్ద చరిత్ర వుంది .. ప్రపంచానికి ఆ దేశం ఎన్నొ నేర్పించింది..మరి అంత గొప్ప దెశం అలా ఎలా మారిపొయింది అనే గా మీ డౌటు .. నాకు అదె అనుమానం వచ్చింది ..అది తెలుసుకుందాం అనే ప్రయాణం మొదలు పెట్టాను ...ఆ దేశం లొ ఆర్ధిక రాజధాని గా పేరు వున్న ఒక వూరికి వెళ్ళాను,ట్రైన్ దిగి వెల్తుండగా టపాసులు పేలుస్తున్న శబ్దం వచ్చింది .. వెనక్కి తిరిగి చూసె లోపు నాకు ఎదొ జరిగింది ..కళ్ళు తెరిచి చూస్తె హోస్పిటల్ లొ వున్న..బాంబు పేలి నేను పడి వుంటే ఎవరొ తెచ్చి నన్ను ఇక్కద పడుకొ పెట్టారు .. పెద్దగా దెబ్బలు తగలలేదు .. వెంటనె లేచి అక్కడ వున్న కిటికి లొకి చూస్తున్నా.. పిల్లలు ఆడుకుంటున్నారు ..వారిలొ ఒకడు బొమ్మ తుపాకి పట్టుకుని అందరిని కాలుస్తున్నాడు .. అందరు కింద పడి పొయారు.. కాసేపు ఇయ్యాక ఇంకొ చిన్న పిల్లాడు వచ్చి పక్కన వున్న ఒక బొమ్మ మైకు దగ్గర పెట్టుకుని .."నేను దీన్ని తీవ్రం గా ఖండిస్తున్నాను " అని పెద్ద గా అరుస్తున్నాడు.. మరొ పక్క ఇంకొంతమంది పిల్లలు ఒక బొమ్మ మీద అగ్గి పుల్ల వేసి కాలుస్తున్నారు.. ఇంకొ బుడ్డోడు ఇంకొ మైకు అందుకుని "ఉగ్రవాదాన్ని ఉక్కు పాదం తొ అణిచెస్తాం " అని అరుస్తున్నాడు.. ఇంకొ ఒకడు "కఠిన చట్టాలు కావాలి " అని గొల చెస్తున్నాడు... వాళ్ళని పిలిచి ఏమి ఆట ఆడుతున్నాను అని అడిగా .. వాళ్ళు వేంటనె గట్టిగా "మేము ఉగ్రవాదం ఆట ఆడుతున్నాం" అని చెప్పారు.. ఇది లేటెస్ట్ ఆట అంట ... ఆట బాగ ఆడుతున్నారు కదా..సరేలె అని కట్టు కట్టించుకుని బయటకు వచ్చెసా ..
బయట ఒక టీ స్టాల్ లొ టీ తాగుతు అక్కడె వున్న టీవి చూస్తున్నాను.. టీవి లొ ఎవరొ కొంత మంది పెద్ద వాళ్ళు ఇందాక పిల్లలు ఆడిన ఆటె వీళ్ళు ఆడుతున్నారుఅప్పుడు అర్ధం అయ్యింది మనకి.. అదె టీ స్టాల్ లొ మళ్ళీ బాంబు పేలింది ..
"ఆట మళ్ళి మొదలయ్యింది.."
మన కథ లొ రెండవ భాగం త్వరలొ వస్తుంది..

2 comments:

jitendrasoftwareengg said...

hiiiiii anna idanta cha divetha nuvu project intervew kosam akdi kovelala ni annav kadha..........................
oka vela nuvu mumbai vlavomo akkda ii situation adhuraindhoma anukuna last ki ata modha lindhi annavu
baga rasav anna

jitendrasoftwareengg said...

nijam ga chdhi vethe allne ani pinchindhi