Saturday, May 9, 2009

సామాన్యుడి ప్రశ్న మూడవ భాగం

మరల బీహార్ కి మొదలెట్టా ... ikkada దొరకని విలువలు ఎమన్నా దొరుకుతాయేమో అని ...
మధ్య లూ మనసు ఎందుకో తమిళనాడు వైపు లాగింది ...మీకు అరవం రాదు కాబట్టి అన్ని తెలుగు లోనే వివరిస్తాను .. సరే అక్కడ ఏముందో చూద్దామని బయలుదేరాను ...
ఎలక్షన్లు కదా ..మాంచి వేడి గా వుండి వాతావరణం ...
ప్రాంతం : చెన్నై లోని మరణానిధి గారి నివాసం
సమయం :ఏప్రిల్ ఇరవయి ఏడు , రాత్రి పది గంటలు
------------------
"
అయ్యా ఎలక్షన్ల లో మన పార్టీ గెలుస్తుందా .. నాకు డౌటే .." -- ఒక నాయకుడి అనుమానం
అయా క్షణమే మరణానిధి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ...

ప్రాంతం : చెన్నై లోని ఒక సెంటర్
సమయం :ఏప్రిల్ ఇరవయి ఎనిమిది , వుదయం కథ గంటలు


------------------

సెంటర్ లో ఒక షామియానా ... దాంట్లో ఒక గుంపు .. చుట్టూ గోల గోల లో వుంది .. పాపం ఎవరినా పోయారేమో వెళ్లి పలకరిందాం అనిపించింది ... వెళ్లి చూస్తే నల్ల కళ్ళ జోడు పెట్టుకున్న ఒక పెద్ద మనిషి మంచం మీద అడ్డం పడుకున్నాడు ... పక్కనే నాలుగు ఎయిర్ కూలర్ లు వున్నాయి.. కష్టపడి ఎండలో పడుకొవడం ఎందుకు !!మళ్ళి ఎయిర్ కూలర్ లు ఎందుకు ..అదేదో ఇంట్లో ఏసీ వేసుకుని పడుకోవచ్చు గా ... ఎమిటోఓఓఓఓఓ ....

వెళ్లి అడిగా ఏమయింది అని.. నా మాట ఎవరు పట్టించుకోలేదు ..
ఇంతలో .....టింగ్ టింగ్.. "శ్రీ లంక లో తమిళుల కోసం మరణానిధి గారి నిరాహార దీక్ష .. చూస్తూ వుండండి టీవీ నైన్"
"
సరిత వినపడుతుండా .. అక్కడ పరిస్థితి ఎలా వుంది .. పెద్దాయన వున్నారా ?? పోయారా..!!!"
"
హా రాజు .. ఇక్కడ పరిస్థితి చాల దారుణం గా వుంది.. "మరణానిధి" గారు చాల నీరసం గా వున్నారు ... మూడు గంటల నుంచి అభిమానులు ఎంత బ్రతిమాలుతున్న ఆయన ఒక్క చికన్ ముక్క కూడా తినట్లేదు.. ఆయన పోతారేమో అని కొందరు భాద పడుతున్నారు... నిజంగ పోతారా అని కొందరు ఆశ గా చూస్తున్నారు.. ఏది ఏమైనా ఇక్కడ అభిమానుల ఆక్రందనలు మిన్నంటాయి ... కావాలంటే వినండి .... బొయ్యో... వాయా ..వామ్మూ .. మా నాయకుడు బ్రతకాలి.. " ఓకే రాజు ఇక్కడ ఇలా వుంది పరిస్థితి --- కెమెరా మెన్ తిక్కన్న తో సరిత ఫ్రం టీవీ నైన్ ..

శ్రీ లంక లో తమిళుల కోసం ఈయన ఇక్కడ గాంధీ గిరి చేస్తున్నారంట ..అంటే ఒక మూడు గంటలు ఏమి తినకుండా అతి భయంకరమైన నిరాహార దీక్ష చేస్తున్నాడు... ఇంతలో ఒక అభిమాని మరో మట్టన్ ముక్క తీసుకొచ్చి తినమన్నాడు ..
ఐనా అయన తినలేదు ... అక్కడ వున్న అభిమానులకి శ్రీలంక ప్రభుత్వం మీద పిచ్చ కోపం వచ్చింది .. కోపం తో కళ్లు ఎరుపులు ఎక్కాయి .. నోట్లోంచి అదేదో డబ్బింగు సినిమా లో డ్రాగాన్ నోట్లోంచి మంటలు వచ్చినట్టు వీళ్ళకి వస్తున్నాయి.. నాకు మంటలు తగిలాయి.. కొంచెం లైట్ గా కాలి నా ముక్కు నల్ల బడింది ....
అంతే వాళ్లు వెళ్లి వీధి మీద పడ్డారు.. ఒక నాలుగు బస్సుల్ని ..ఒక నాలుగు స్ట్రీట్ లైట్లని పగలగొట్టారు .. అలా వాళ్లకు చేతనైనంత లో వాళ్లు కూడా గాంధి గిరి చేయడం మొదలెట్టారు ..

ప్రాంతం : చెన్నై లోని కుమారి యజలలిత నివాసం ...
సమయం : అదే రోజు రాత్రి పది గంటలు
------------------------------
"
అమ్మా ... వాళ్లు ఎంత పని చేసారు అమ్మా.. ఏమి మనం మాత్రం ఎమన్నా తక్కువ తిన్నామా .. మనం కూడా రేపు నిరాహార దీక్ష చేద్దాం.. వాడు మూడు గంటలు నిరాహార దీక్ష చేస్తే మనం మూడు గంటల రెండు నిముషాలు చేద్దాం ..
వాడి రికార్డులు బద్దలు కొడదాం
శ్రీలంక దిష్టి బొమ్మ తగులబెడదాం
తమిళ మాత విగ్రహానికి పాలతో అభిషేకం చేద్దాం
ఎహేయ్ ... ఇవన్ని ఏముంది అసలు శ్రీ లంక అనే పదాన్ని మన తమిళనాడు నుండి వెలి వేద్దాం "
మళ్ళి మరునాడు కూడా అమ్మ యజలలిత గారు దీక్ష చేసారు ... ఇంకా ఏమేమి చెయ్యాలనుకున్నారో అన్ని చేసేసారు..
ఎలక్షన్లు ఐపోయాయి... అన్ని గొడవలు సర్దుకున్నాయి ..

మన కథ లో నీతి : సోదర సోదరీమణులారా .. కావున నేను చెప్పేది ఎంటంటే ..
మన రాజకీయ నాయకులు వాళ్ళ జీవన మరియు అస్థిత్వ పొరాటం లొ ఎన్నొ చెత్త అలోచనలు చేస్తారు .... వాటిని మన లాంటి తింగర బుచ్చుల ద్వారా దేశం మీదకి వదుల్తారు : నా వూరు .. నా జిల్లా .. నా ప్రాంతం ..నా కులం అంటూ ముందుకి ఉరికితే మనకే నష్టం ... వాళ్ళకి బాగానె వుంటుంది మనకి మాత్రం పైన ..కింద పగుల్తుంది
నిజం గా గాంధి గిరి ప్రదర్శించాలంటే అయన లా దక్షిణ ఆఫ్రిక దేశం వెళ్ళి అక్కడ మన భారతీయుల కోసం పొరాడినట్టు వీళ్ళు కూడా శ్రీ లంక వెళ్ళి అక్కడ తమిళుల కోసం అక్కడి ప్రభుత్వం తో పోరాటం చెయ్యమనండి.... వీళ్ళ ప్రతాపం అంతా ఇక్కడి బస్సుల మీదా .. వీధి లైట్ల మీదా చూపించగలరు ... ఇలా ఆవేశ పడే వారిలో చదువుకున్న మూర్ఖులు ఎవరైనా వుంటే బుద్ధి తెచ్చుకోండి.. చదవుకోని మెధావులకి నిజాలు తెలియచెప్పండి
వీళ్ళు 3 గంటలు నిరాహార దీక్ష చెసే బదులు ఒక 3 నిముషాలు ఊపిరి తీసుకోని దీక్ష ఎదైన ట్రై చెస్తె బెటర్

కొసమెరుపు :
-----------------------------------
సమయం : 10/04/2014 రాత్రి 10 గంటలు
ప్రాంతం : చెన్నై
మరణానిధి ఇంట్లో సమావేశం జరుగుతుంది ..
"
అయ్యా మళ్ళీ మనం ఓడిపోయేలా వున్నాం " -- ఒక నాయకుడి ఆవేదన...
మరణానిధి ముఖం లో చిరునవ్వు.. అయన బుర్ర లో ఎదొ నీచపు అలోచన వస్తున్న సంకేతాలు ..
"
అహా.. ఎంటీ అన్యాయం ... మనకి స్వాతంత్రం వచ్చిన నాటినుండీ మనకి డిల్లీ యే రాజధాని గా వుంటుంది ... ఏమి మన తమిళులు ఎమి తక్కువ తిన్నారు... నా చెన్నై కి అన్యాయం జరిగిపోతుంది బాబోయ్ ... ప్రజలారా!!! చెన్నై ని మన దేశానికి రాజధానిని చెయ్యాలి... అప్పటి వరకు మనం నిద్ర పోకూడదు..
రేపు నేను ఒక 2 గంటలు నిరాహార దీక్ష చెస్తాను.. మీరు కూడ "శాంతియుతం" గా ఉద్యమం మొదలెట్టండి ...
రక్తం చిందించైనా సరే చెన్నై ని భారత దేశానికి రాజధానిని చెయ్యండి !!!!" --- ఇట్లు మీ మరణానిధి