Saturday, October 27, 2018


నేను క్రిందపెట్టిన పోస్ట్ (https://www.facebook.com/sriharsha.karuturi/posts/2168471956517935) ఒక్క రోజులో అవేశం లోనో కోపం లోనో పెట్టింది కాదు. ఎప్పటి నుంచో అలోచిస్తున్న సమస్యే. ఆ పోస్ట్ లో ఇంకా చాల విషయాలు కారణాలు సవివరం గా రాయాలని అనుకున్నాను. ఎందుకంటే అది చాలా పెద్ద నిర్ణయం. కాని అవి రాస్తే నాకు తెలిసిన కొందరు నా YSRCP మిత్రులు చేసిన పనులు వుదాహరించవలిసి వస్తుంది. అవి చెప్పి వారిని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. అందుకే చాలా క్లుప్తం గా ముగించాను.  కింద నేను పెట్టిన సమాధానం చదివే ముందు దయచేసి పోలరైస్ కాకుండ చదువు. ఇది నా అనాలిసి మాత్రమే. నాది తప్పు అనేలా రేపు ఎవరు నిరూపించినా నేను ఒప్పుకుంటాను.  This post is just a reply to a comment for the above FB post.

హెరిటెజ్ సంస్థ స్థాపించి ఎదిగింది షార్ట్ టైం లో కాదు. అది మొదలు పెట్టి 26 ఎళ్ళు ఐయ్యింది. ఇక్కడ విషయం ఏంటంటె అది స్థాపించిన చంద్రబాబు స్థాయి చూస్తున్నారు కాని ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలైన భువనేశ్వరి ఎవరి కూతురనేది మరిచి పోయారు. ఎన్.టీ.ఆర్ దాదాపు 40 ఏళ్ళు సినిమాల్లో లో ఎంతో సంపాదించారు. అది తన పిల్లలకు పంచకుండా వుండరు గా. మీరు చెప్తున్న 177 లెక్క లో ఇప్పుడు కొత్తగా మళ్ళీ బ్రామ్హణి తండ్రి నుండి తెచ్చుకున్న ఆస్థులు కూడా చేరాయ్. పోనీ మీరు అనుకుంటున్నట్టు ఆ పాయింట్ కూడా రూలవుట్ చెద్దాం. చంద్రబాబు అవినీతి చేసేశాడు అనుకుందాం. అప్పుడు అది Disproportionate assets కేస్ అవుతుంది. అంటె అదాయానికి ఆస్తులకు సంబంధం లేకుండా వుండడం.

ఒకసారీ చంద్రబాబు రాజకీయ ప్రస్థానం చూస్తే టీ.డీ.పీ పెట్టిన నాటి నుండీ కేంద్ర పార్టిలకు ముఖ్యం గా కాంగ్రేస్ కు కొరకరాని కొయ్య లా తయారయ్యాడు. టి.డీ.పీ పెట్టిన నాటి నుండీ కేంద్రం లో ఏర్పడిన ప్రతి నాన్-కాంగ్రేసు ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యం/నేతృత్వం/భాగస్వామ్యం లో ఏర్పడినవే. ఆయన్ను మూయించడానికి అటి ఇటు గా 26 ఎంక్వయిరీ లు వేసారు. అందులో కొన్ని సీ.బీ.ఐ కూడా చేపట్టింది.  అంతం కోపం లో వున్న వారు ఎదైనా క్లూ దొరికితే వదిలి పెడతారా? తెలంగాణా విడిపోయినప్పుడు అన్ని పార్టీలు కలిసి ఆయన పై ఎలా ముప్పేట దాడికి దిగాయొ మనకి తెలిసిందే. అప్పుడు కూడా విధానపరం గా దాడి చెయ్యగలిగారు కాని వ్యక్తిగతం గా ఏమీ చెయ్యలేక పోయారు. ఇప్పుదు కొందరంటున్నారు. ఆ 26 కేసుల్లో కొన్నింటికి స్టే తెచ్చుకున్నాడు అని. ఒకటి రెండు ఐతే పర్లేదు. ఇంక అదే పనిగా కేసులు వేస్తుంటే ఇంక పనులు మానుకుని కోర్టులు చుట్టు తిరగాలా?  2017 కి వచ్చేసరికి ఆ కేసులు కూడా మొత్తం క్లోస్ ఐపోయాయ్. పోనీ కాంగ్రేస్ సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు దేశం లో వ్యక్తిగత కక్షల రాజకీయం నడుస్తుంది. మోదీ కి శతృవులందరినీ ఒక్కొక్కరినీ ఆర్ధికం/రాజకీయం/వ్యక్తిగతం గా దెబ్బతీసి ఏరి పారేస్తున్నారు. ఆళ్ళు మంచోళ్ళా చెడ్డోళ్ళా అని అనవసరం. అందరు లేచిపోతున్నారు. ఇంత కక్షాపూరిత రాజకీయం లో కూడా  వెతికి వెతికి ఎప్పుడో పదేళ్ళ క్రితం బాబ్లి కేసు తోడారు కాని  ఆయన్ని ఏమీ చెయ్యలేకపోతున్నారు గా.
దీనికి కూడా - "లేదు చంద్ర బాబు దేశం లోనే ఎవరికి దొరకనంతగా మేనేజ్ చేస్తున్నాడు" అంటె దానికి ఎంత Probability వుందనేది జనాల బుర్రలకు సంబంధించిన విషయానికి వదిలేస్తున్నాను. ఆయనేమి దేవుడు కాదు. 

ఇక పొతే మన జనాల ఫేవరేట్ లేబుల్ "వెన్నుపోటు" విషయానికి వద్దాం. అప్పటి దాక ఎన్.టీ.ఆర్ ప్రభుత్వం లో కుటుంబ పైరవీలు లేవ్. లపా ఆయన జీవితం లోకి వచ్చాక సమాంతర అధికారం కేంద్రం ఏర్పడింది.  అంటె పేరలల్ పవర్ సెంటర్. ఆయన ఇంట్లో లేనపుడు ఫైళ్ళు పట్టుకుని ఆవిడ దగ్గరకు చేరే వాళ్ళు ఎక్కవైపోయారు. పత్రికల్లో రోజూ అదే న్యూసు ఐపోయింది. 
https://twitter.com/megaloyalfans/status/904348504511864832

https://goo.gl/images/ruFL3r
) జనాలకు పార్టీ మీద నమ్మకం సన్నగిల్లడం మొదలెట్టింది. ప్రజా విప్లవం అనేది తరానికి ఒకసారే వస్తుంది. ఒక సారి అది కోల్పోతే మళ్ళ్ ఇంకో కొత్త వాళ్ళకు అవకాశం రావడానికి ఒక తరం పడుతుంది. 1977 లో జనతా ప్రభుత్వం విఫలం ఐయ్యాక మళ్ళీ ఆం ఆద్మీ విప్లవం రావడానికి 40 ఏళ్ళు పట్టింది. అలాంటిది మన రాష్ట్రం లో ఏన్.టీ.ఆర్ మొండితనం వల్ల పరిస్థితి చెయ్యదాటి పోయింది. అప్పుడు మనం చిన్నపిల్లలమే. కాని నాకు మా నాన్న అవే నాకు విడమరిచి చెప్పే వారు. నీకు గుర్తుండె వుంటుంది అందుకే నేను క్లాస్ లో టిచర్ల తో ఎక్కువ రాజకీయ వాదనలు వేసే వాడిని. క్విజ్ పోటీలకు ఎక్కువ వెళ్ళే వాడిని. 
రాష్ట్రం ఏమి ఎన్.టీ.ఆర్ సొత్తు కాదు నేనే నిర్మించాను నేనే కూలదోస్తాను అనడానికి. కోట్ల మంది భవిష్యత్తు అది.  చివరకు ఒక రోజు ఎన్.టీ.ఆర్ 8 మంత్రులను ఒకేసారి క్యాబినెట్ నుండి బహిష్కరించడం తో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. అప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అది. ఇవేమీ నేను ఊహించి చెప్తున్నవి కాదు. పాత జర్నల్స్ తిరగేసి చూస్తే మీకె తెలుస్తుంది. 
((Yes. it is a fact. but it does mater how we label it. A CEO can be thrown out of his own company if he is not performing well. Should we spare a leader who can decide peoples fate.)
వెన్నుపోటుకి కర్రెక్టు ఉదాహరణలు నేను ఇస్తాను చూడు :
1. ఎన్.టీ.ఆర్ అమెరికా వెళ్ళినపుడు 222 బలం తొ వున్న టి.డి.పీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసి 60 మంది తో నాదెండ్ల ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం.
2. చంద్ర బాబు మీద వున్న కోపం మన రాష్ట్రం మీద చూపిస్తూ మోదీ చేస్తున్న పనులు

రేపు చంద్రబాబు వయసు మీరాక ఇలానే తిక్క గా ప్రవర్తించి ఎవరైనా ఆయన్ను పక్కన పెట్టి అధికారం తీసుకుంటె నిర్మొహమాటం గా నేను వాళ్ళకే సప్పోర్ట్ చేస్తాను. ఇది ప్రజాస్వామ్యం. ఎవరి సొత్తు కాదు. 

ఇంక చివరగా అసలు పాయింటు. (choosing friends by religion is no different that choosing them by political view) . దీనితో నేను ఈ ఒక్క పార్టి విషయం లో  ఏకిభవించలేను మిత్రమా. ప్రపంచం లో ఏ మతం అరాచకాన్ని అధర్మాన్ని చెయ్యమని చెప్పలేదు. అది ఆయా మతాల్లో జనాలు చేస్తున్న తప్పుడు interpretation. అందు వల్ల కొందరి చేసే పనులు మన్సులో పెట్టుకుని ఆ మతం లో వున్న మన స్నేహితులను దూరం చేసుకోవడం మూర్ఖత్వమే. కాని ఇక్కడ ఆ పార్టీ పునాదులె అరాచకం. ఏమంటె అది జరగాల్సిందే. టి.డీ.పీ లో  కూడ తప్పులు జరుగుతున్నాయ్ కాని మరీ ఇంత దారుణం గా కాదు. 1956 నుచి 2009 వరకు మన స్టేట్ లెక్కలు తీసుకుంటే శ్రీమాన్ జగ్గడు గారు దాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఇక్కడ సమస్య అతని ధన దాహం కాదు. అతను అలోచనా విధానం. రైళ్ళు తగలబెట్టిస్తారు, పోలవరం కాలువలకు గండ్లు కొడతారు, రాజధాని తోటలు తగలబెడతారు, గుంటూరు లొ మత ఘర్షణలు లేపాలని చూసారు, లోన్లు రాకుండా ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తారు. 

అరే, నాకు తెలిసి ఇంత అరాచకం ఎవ్వరూ చెయ్యలేరు. కొందరు సాక్షి న్యూస్ చదివి టీ.డీ.పీ కూడ అంతే అంటారు. ఎలక్షన్ కౌంటింగ్ లో ఒక పక్క అన్ని చానళ్ళ లో ట్.డీ.పీ గెలుపు మీద వార్తలు వేస్తుంటే సాక్షి లో మాత్రం "గెలుపు దిశ గా దూసుకు పోతున్న జగన్" అని వేసారంటె. దాని క్రెడిబిలిటీ మీద ఇంకా డౌట్స్ రాని బుర్రలకు ఒక లాల్ సలాం. మిగిలిన చానళ్ళు కూడ ఎంతో కొంత పోలరైస్ అవుతాయ్ కానీ ఇంత దారుణం గా కాదు. అలాంటప్పుడు అన్ని ఒక్కటె జాతి అని ఎలా అనగలం? అలాంటి చానల్ చల్లుతున్న బురద ని నమ్మి అందరు రాజకీయ నాయకుల్ని ఒకటే లెవెల్లో ఎలా చూడగలం. తప్పు తప్పుకీ తీవ్రత వుంటుంది. దొంగతనానికి జైలుశిక్ష పడితే హత్య కి ఉరి పడుతుంది. ఇద్దరినీ ఒక్కటే అని ఎలా అనగలం? 

ఇంత బహిరంగంగా ఆ పార్టీ అరాచకాలను సమర్ధిస్తూ జగ్గడిని దేవుడిలా కొలిచే వాళ్ళని ఎలా  ట్రీట్ చెయ్యాలి. 
ఇవన్ని పక్కన పెట్టు. మీ వీధి లో చదువుకుని కాస్త మర్యాదగా నడుచుకునే వారుంటారు. తీవ్ర నేర చరిత్ర వున్న వారుంటారు. ఇద్దరిలో ఎవరిని నువ్వు ఇంట్లోకి రానిస్తావ్? We can definitely not link religion with political parties. 

No comments: