ఆగస్టు 15 , మన దినచర్య
1. ఉదయం లేచి తయారవుదాం .. టీవి పెడదాంఅందులొ కళ్ళుండి చూడలేని..నాలుక వుండి మాట్లాడలేని ఒక ముసలాయన వుంటారు ..ఆయనకు ఒక సలాం కొడదాం
2. టీవి లొ 3 రంగుల బట్టల్లొ మెరిసిపొయే ఏంకర్లు మన గాంధి ,నెహ్రు ఇందిరా గాంధి ఇంకా మిగిలిన గాంధిలు ..వీరి గురించి మాత్రమే చెప్తారు ..వినండి.. కుదిరితే ఒక 2 కన్నీటి చుక్కలు కార్చండి
3. భ్రిటీష్ వారు మన జనాన్ని ఎలా కుమ్మారొ చూపిస్తారు .. బీపి ఒక 30 ఇంకా దేశ భక్తి ఒక 100 పాయింట్లు పెరుగుతుంది ..
4. ఇప్పుడు అదే ఊపులొ జెండా వందనం కి వెళ్ళండి.. అక్కడ జెండా ఎగరగానే దేశభక్తి ఇంకొ 50 పాయింట్లు పెరుగుతుంది
5. చాక్లెట్టు తినేసి మళ్ళీ ఇంటికి వచ్చెసి టీవి లొ ఎదొ ఒక దేశ భక్తి చిత్రం చూడండి .. దేశ భక్తి ఇంకొ 50 పాయింట్లు పెరుగుతుంది ..
6. సాయంత్రం అయ్యేసరికి అవేశం తో పాకిస్తాన్ ని ఒక 4 బూతులు .. బ్రిటీషు వాళ్ళని ఒక 4 బూతులు తిట్టుకొండి (మీకు బూతులు రాకపోతే యూట్యూబు లో మన శాసన సభ సమావేశాలు చూడండి)
7. రాత్రి అయ్యెసరికి శెలవ అయిపోయిందని కొంచెం బాధ వుంటుంది.. జగన్ జైల్లో వున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరే ఓదార్చుకోండి
8. ఆఖరిగా, ఎగరేసిన జెండాని జాగ్రత్త గా మడత పెట్టీ బీరువా లోను, ఇంక మన దేశ భక్తి ని మడత పెట్టి మనసు లోను దాచెయ్యండి..
దేశం అంటె మట్టి కాదొయి..మనుషులోయి అనేది పాత నానుడి
దేశం అంటె బాధ్యత కాదోయి .. దేశం అంటె హక్కులు..కులాలు..ప్రాంతాలు...డబ్బులు.."మనోభావాలు"... తొక్కలొ భావాలు..
మన కృషి లేకుండా పని అయిపొవాలని దేవుడికి చేసే ప్రార్ధన = దేశం పై మన బాధ్యత మరిచి జెండా కి చేసె వందనం ... రెండు ఒక్కటే..
మీరు చెయగలిగిన ప్రయత్నం మీరు చెయ్యండి ..లేకపోతే నాలాగ ఇలా అక్షరాన్ని అడ్డం పెట్టుకుని ఏడవండి..
No comments:
Post a Comment