Saturday, May 9, 2009

సామాన్యుడి ప్రశ్న మూడవ భాగం

మరల బీహార్ కి మొదలెట్టా ... ikkada దొరకని విలువలు ఎమన్నా దొరుకుతాయేమో అని ...
మధ్య లూ మనసు ఎందుకో తమిళనాడు వైపు లాగింది ...మీకు అరవం రాదు కాబట్టి అన్ని తెలుగు లోనే వివరిస్తాను .. సరే అక్కడ ఏముందో చూద్దామని బయలుదేరాను ...
ఎలక్షన్లు కదా ..మాంచి వేడి గా వుండి వాతావరణం ...
ప్రాంతం : చెన్నై లోని మరణానిధి గారి నివాసం
సమయం :ఏప్రిల్ ఇరవయి ఏడు , రాత్రి పది గంటలు
------------------
"
అయ్యా ఈ ఎలక్షన్ల లో మన పార్టీ గెలుస్తుందా .. నాకు డౌటే .." -- ఒక నాయకుడి అనుమానం
అయా క్షణమే మరణానిధి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ...

ప్రాంతం : చెన్నై లోని ఒక సెంటర్
సమయం :ఏప్రిల్ ఇరవయి ఎనిమిది , వుదయం కథ గంటలు


------------------

సెంటర్ లో ఒక షామియానా ... దాంట్లో ఒక గుంపు .. చుట్టూ గోల గోల లో వుంది .. పాపం ఎవరినా పోయారేమో వెళ్లి పలకరిందాం అనిపించింది ... వెళ్లి చూస్తే నల్ల కళ్ళ జోడు పెట్టుకున్న ఒక పెద్ద మనిషి మంచం మీద అడ్డం గ పడుకున్నాడు ... పక్కనే నాలుగు ఎయిర్ కూలర్ లు వున్నాయి.. కష్టపడి ఎండలో పడుకొవడం ఎందుకు !!మళ్ళి ఆ ఎయిర్ కూలర్ లు ఎందుకు ..అదేదో ఇంట్లో ఏసీ వేసుకుని పడుకోవచ్చు గా ... ఎమిటోఓఓఓఓఓ ....

వెళ్లి అడిగా ఏమయింది అని.. నా మాట ఎవరు పట్టించుకోలేదు ..
ఇంతలో .....టింగ్ టింగ్.. "శ్రీ లంక లో తమిళుల కోసం మరణానిధి గారి నిరాహార దీక్ష .. చూస్తూ వుండండి టీవీ నైన్"
"
సరిత వినపడుతుండా .. అక్కడ పరిస్థితి ఎలా వుంది .. పెద్దాయన వున్నారా ?? పోయారా..!!!"
"
హా రాజు .. ఇక్కడ పరిస్థితి చాల దారుణం గా వుంది.. "మరణానిధి" గారు చాల నీరసం గా వున్నారు ... మూడు గంటల నుంచి అభిమానులు ఎంత బ్రతిమాలుతున్న ఆయన ఒక్క చికన్ ముక్క కూడా తినట్లేదు.. ఆయన పోతారేమో అని కొందరు భాద పడుతున్నారు... నిజంగ పోతారా అని కొందరు ఆశ గా చూస్తున్నారు.. ఏది ఏమైనా ఇక్కడ అభిమానుల ఆక్రందనలు మిన్నంటాయి ... కావాలంటే వినండి .... బొయ్యో... వాయా ..వామ్మూ .. మా నాయకుడు బ్రతకాలి.. " ఓకే రాజు ఇక్కడ ఇలా వుంది పరిస్థితి --- కెమెరా మెన్ తిక్కన్న తో సరిత ఫ్రం టీవీ నైన్ ..

శ్రీ లంక లో తమిళుల కోసం ఈయన ఇక్కడ గాంధీ గిరి చేస్తున్నారంట ..అంటే ఒక మూడు గంటలు ఏమి తినకుండా అతి భయంకరమైన నిరాహార దీక్ష చేస్తున్నాడు... ఇంతలో ఒక అభిమాని మరో మట్టన్ ముక్క తీసుకొచ్చి తినమన్నాడు ..
ఐనా అయన తినలేదు ... అక్కడ వున్న అభిమానులకి శ్రీలంక ప్రభుత్వం మీద పిచ్చ కోపం వచ్చింది .. కోపం తో కళ్లు ఎరుపులు ఎక్కాయి .. నోట్లోంచి అదేదో డబ్బింగు సినిమా లో డ్రాగాన్ నోట్లోంచి మంటలు వచ్చినట్టు వీళ్ళకి వస్తున్నాయి.. నాకు ఆ మంటలు తగిలాయి.. కొంచెం లైట్ గా కాలి నా ముక్కు నల్ల బడింది ....
అంతే వాళ్లు వెళ్లి వీధి మీద పడ్డారు.. ఒక నాలుగు బస్సుల్ని ..ఒక నాలుగు స్ట్రీట్ లైట్లని పగలగొట్టారు .. అలా వాళ్లకు చేతనైనంత లో వాళ్లు కూడా గాంధి గిరి చేయడం మొదలెట్టారు ..

ప్రాంతం : చెన్నై లోని కుమారి యజలలిత నివాసం ...
సమయం : అదే రోజు రాత్రి పది గంటలు
------------------------------
"
అమ్మా ... వాళ్లు ఎంత పని చేసారు అమ్మా.. ఏమి మనం మాత్రం ఎమన్నా తక్కువ తిన్నామా .. మనం కూడా రేపు నిరాహార దీక్ష చేద్దాం.. వాడు మూడు గంటలు నిరాహార దీక్ష చేస్తే మనం మూడు గంటల రెండు నిముషాలు చేద్దాం ..
వాడి రికార్డులు బద్దలు కొడదాం
శ్రీలంక దిష్టి బొమ్మ తగులబెడదాం
తమిళ మాత విగ్రహానికి పాలతో అభిషేకం చేద్దాం
ఎహేయ్ ... ఇవన్ని ఏముంది అసలు శ్రీ లంక అనే పదాన్ని మన తమిళనాడు నుండి వెలి వేద్దాం "
మళ్ళి ఆ మరునాడు కూడా అమ్మ యజలలిత గారు దీక్ష చేసారు ... ఇంకా ఏమేమి చెయ్యాలనుకున్నారో అన్ని చేసేసారు..
ఎలక్షన్లు ఐపోయాయి... అన్ని గొడవలు సర్దుకున్నాయి ..

మన కథ లో నీతి : సోదర సోదరీమణులారా .. కావున నేను చెప్పేది ఎంటంటే ..
మన రాజకీయ నాయకులు వాళ్ళ జీవన మరియు అస్థిత్వ పొరాటం లొ ఎన్నొ చెత్త అలోచనలు చేస్తారు .... వాటిని మన లాంటి తింగర బుచ్చుల ద్వారా దేశం మీదకి వదుల్తారు : నా వూరు .. నా జిల్లా .. నా ప్రాంతం ..నా కులం అంటూ ముందుకి ఉరికితే మనకే నష్టం ... వాళ్ళకి బాగానె వుంటుంది మనకి మాత్రం పైన ..కింద పగుల్తుంది
నిజం గా గాంధి గిరి ప్రదర్శించాలంటే అయన లా దక్షిణ ఆఫ్రిక దేశం వెళ్ళి అక్కడ మన భారతీయుల కోసం పొరాడినట్టు వీళ్ళు కూడా శ్రీ లంక వెళ్ళి అక్కడ తమిళుల కోసం అక్కడి ప్రభుత్వం తో పోరాటం చెయ్యమనండి.... వీళ్ళ ప్రతాపం అంతా ఇక్కడి బస్సుల మీదా .. వీధి లైట్ల మీదా చూపించగలరు ... ఇలా ఆవేశ పడే వారిలో చదువుకున్న మూర్ఖులు ఎవరైనా వుంటే బుద్ధి తెచ్చుకోండి.. చదవుకోని మెధావులకి నిజాలు తెలియచెప్పండి
వీళ్ళు 3 గంటలు నిరాహార దీక్ష చెసే బదులు ఒక 3 నిముషాలు ఊపిరి తీసుకోని దీక్ష ఎదైన ట్రై చెస్తె బెటర్

కొసమెరుపు :
-----------------------------------
సమయం : 10/04/2014 రాత్రి 10 గంటలు
ప్రాంతం : చెన్నై
మరణానిధి ఇంట్లో సమావేశం జరుగుతుంది ..
"
అయ్యా మళ్ళీ మనం ఓడిపోయేలా వున్నాం " -- ఒక నాయకుడి ఆవేదన...
మరణానిధి ముఖం లో చిరునవ్వు.. అయన బుర్ర లో ఎదొ నీచపు అలోచన వస్తున్న సంకేతాలు ..
"
అహా.. ఎంటీ అన్యాయం ... మనకి స్వాతంత్రం వచ్చిన నాటినుండీ మనకి డిల్లీ యే రాజధాని గా వుంటుంది ... ఏమి మన తమిళులు ఎమి తక్కువ తిన్నారు... నా చెన్నై కి అన్యాయం జరిగిపోతుంది బాబోయ్ ... ప్రజలారా!!! చెన్నై ని మన దేశానికి రాజధానిని చెయ్యాలి... అప్పటి వరకు మనం నిద్ర పోకూడదు..
రేపు నేను ఒక 2 గంటలు నిరాహార దీక్ష చెస్తాను.. మీరు కూడ "శాంతియుతం" గా ఉద్యమం మొదలెట్టండి ...
రక్తం చిందించైనా సరే చెన్నై ని భారత దేశానికి రాజధానిని చెయ్యండి !!!!" --- ఇట్లు మీ మరణానిధి

Monday, March 30, 2009

సమాన్యుడి ప్రశ్న.. మన కథ లొ 2' వ భాగం

సమాన్యుడి ప్రశ్న.. మన కథ లొ 2' వ భాగం
సమయం : 10:30 , జనవరి 23, 2009
ప్రాంతం : చంపారన్ పట్టణం
=================================================
"చంపెయ్యండి వాళ్ళని.. చంపెయ్యండి" ..చుట్టు జనం అరుపులు వినపడుతున్నాయి ..
మృత్యు దేవత సంచరిస్తున్న వికృత శబ్ధం ... అక్కడ నా కళ్ళ ముందు ఒక పెద్ద జనం గుంపు , వాళ్ళ మధ్యలొ ఎదొ జరుగుతుంది.. వెళ్ళి చూడాలంటే ఏదొ తెలియని భయం .. అయినా వెళ్లి చూసాను

మధ్య లొ ఒకడు కింద పడి వున్నాడు ... ముఖం లొ చావు కి దగ్గరౌతున్న భయం కనపడుతుంది .. అతను చేసిన నేరం ఒక దొంగతనం .. అతన్ని కొట్టడానికి అందరూ తోసుకువస్తున్నారు ... వాళ్ళలొ చిన్న పిల్లలు కూడ వున్నారు .. ఆ పిల్లల మొహం లొ అతన్ని కొట్టడానికి ఉత్సాహం స్పష్టం గా కనపడుతుంది.. చూస్తుండగానె ఒకడు బైక్ వెసుకుని వచ్చాడు , ఈ దొంగని ఆ బైక్ కి తాడు వేసి కట్టేసారు ..అలా ఆ వూరంతా తిప్పి మల్లి ఇక్కడికె తీసుకొచ్చారు.. చివరకి అందరు కలిసి అతన్ని కొట్టి చంపేశారు
కొద్ది సేపటికె టీవి చానెల్స్ లొ ప్రత్యక్ష ప్రసారం మొదలయ్యింది ...
మాట్లాడడం రాని ఒక ఏంకర్ ఇలా అందుకుంది .. " బిహార్ లొని మనుషుల ఆటవికతకు నిదర్శనం గా ఈ రోజు ఒక దారుణమైన సంఘటన జరిగింది .. దొంగతనం చేశాడన్న నెపం తో ఒక మనిషిని గ్రామస్తులు అందరు కలిసి అతి దారుణం గా...అతి కిరాతకం గా చంపెశారు " బీహార్ నుంచి కెమేరా మేన్ జక్కన్న తో సరిత
ఇంతలో
"అసలు బీహార్ లొ వున్నది మనుషులా లేక మృగాలా .. అసలు ఎమి జరుగుతుంది అక్కడ " -- ఒక మహా మేధావి ఆవేదన
"అక్కడి మనుషులను సంస్కరించాల్సిన అవసరం ఎంతైన వుంది" --ఒక మనవతా వాది పిలుపు
"సభ్య సమాజం తల దించుకోవలిసిన రోజు .. బీహార్ మన దేశం లొ చెడి పొయిన ఒక భాగం వంటిది .. నిర్మూలించండి" -- ఒక గుంపు లొ గొవిందయ్య సలహా..
ఇంత జరిగినా అక్కడి జనం కాని అధికారులు కాని పట్టించుకోలేదు ..ఇవేమి చూసి తట్టుకోలేక భరించలేక తిరిగి మన ఆంధ్రా వచ్చెయ్యలని ట్రైన్ ఎక్కేసా .. దారి పొడుగునా నాకు అవే అలోచనలు ..
మనుషుల్లొ కౄరత్వం అంటె ఇదే ఇదే .. ఇంత కన్నా భయంకరమైన మనుషులు ఎక్కడా వుండరు అని అనిపించింది..
మళ్ళి జన్మ లొ బీహార్ వెళ్ళను.. హా వెళ్ళను ..

మరునాడు నేను వున్న ట్రైన్ మన ఆంధ్ర లొకి ప్రవేశించింది...
సమయం : 9:30 , జనవరి 25, 2009
ప్రాంతం : వరంగల్ రైల్వే స్టేషన్
----------------------------------------------------------
ఎంత సేపు చూసినా ట్రైన్ కదలట్లేదు ... ఇంతలో పెద్ద పెద్ద కేకలు అరుపులు నినాదాలు ..ఏమిటో చూద్దామని ముందు వెళ్లి చూసా అక్కడ కొందరు ట్రైన్ కి అడ్డం వెళ్లి పడుకున్నారు పట్టాల మీద ...
"పోలీస్ జులుం నశించాలి .. పోలీస్ దౌర్జన్యం నశించాలి " అంటు అరుస్తున్నారు
అక్కడే వున్నఒకడిని అడిగా ఏమి జరిగిందని ?
"నిన్న ఒక ఆడ పిల్ల మీద ఒకడు ఆసిడ్ పోశాడు , వాడిని పోలీసులు రోజు ఉదయం కాల్చి చంపేశారు " అని చెప్పాడు
ఐతే పోలీసులు మంచి పనే చేసారు కదా మరి మీరు ఎందుకు ఆరుస్తున్నారు అని అడిగా ...
"పోలీసులు రూల్స్ ప్రకారం నడుచుకోలేదు .. ఆ ఆసిడ్ పోసిన నిందితుడి హక్కులను కాల రాసారు .. అతన్ని అన్యాయం గా చంపేశారు ఇది దుర్మార్గం ... సాటి మానవులు గా మేము అతని తరుపున ధర్నా చేస్తున్నాం .. మేము మనవ హక్కుల సంఘం ప్రతినిధులం " అంటు వీడు కూడా వెళ్లి పోయాడు
ఒక్క క్షణం నేను ఎక్కడ వున్నానా అనిపించింది ..ఖచ్చితం గా ఇది బిహార్ కాదు .. ఒక ఆడపిల్ల మీద ఆసిడ్ పోసిన వాడి కోసం వీళ్ళు ట్రైన్ కి అడ్డం పడుకుని నిరసన చేస్తున్నారా???!!!!! ..
వరంగల్ రైల్వే స్టేషన్ లో ఆ క్రూర మృగాల మధ్యలో గడిపిన అనుభవం వల్ల నాకు ఏంటో నిన్న చూసిన బీహార్ ఎ బాగుంది అనిపిస్తుంది .. వీళ్ళతో పోల్చుకుంటే అక్కడి జనం ఎంతో గొప్ప వారిలా కనిపిస్తున్నారు ...
వద్దు నేను మళ్ళి బిహార్ వెళ్ళిపోతా ... అక్కడ వుంటా .. ఆక్కడే వుంటా..


ఒక్క మాట మిత్రులారా ---
సమాజం, కట్టుబాట్లు ,న్యాయ వ్యవస్థ ఇవన్నీ మన కోసం మనం నిర్మించుకున్నాం కాని అవి మన నైతిక విలువలను కాపాడలేనపుడు వాటిని మార్చాలిసిన అవసరం ఎంతైనా వుంది ..నైతిక విలువలు లేనపుడు మన సమాజం లో ఎంత అభివృద్ధి చెందినా అది వృధానే .. న్యాయం కల్పించలేని ఇలాంటి మానవ హక్కులు మనకి వద్దు .. ఇలాంటి సమాజం లో వుంటున్న మనకి బీహార్ ని విమర్శించే హక్కు లేదు .. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం..
హక్కుల కోసం పోరాటాలు మాని బాధ్యతల కోసం నడుం కట్టి ముందు సాగుదాం .. తొండ ముదిరి వూసరవెల్లి అవుతుంది అలానే సామాజిక సృహ ఎక్కువైనా వాడు మానవ హక్కుల కార్యకర్త అవుతున్నాడు ..వీళ్ళు చేసే పని లేని పోరాటాలు వల్ల మన భాధ్యతలను మరువొద్దు
-----జై హింద్