సమాన్యుడి ప్రశ్న.. మన కథ లొ 2' వ భాగం
సమయం : 10:30 , జనవరి 23, 2009
ప్రాంతం : చంపారన్ పట్టణం
=================================================
"చంపెయ్యండి వాళ్ళని.. చంపెయ్యండి" ..చుట్టు జనం అరుపులు వినపడుతున్నాయి ..
మృత్యు దేవత సంచరిస్తున్న వికృత శబ్ధం ... అక్కడ నా కళ్ళ ముందు ఒక పెద్ద జనం గుంపు , వాళ్ళ మధ్యలొ ఎదొ జరుగుతుంది.. వెళ్ళి చూడాలంటే ఏదొ తెలియని భయం .. అయినా వెళ్లి చూసాను
మధ్య లొ ఒకడు కింద పడి వున్నాడు ... ముఖం లొ చావు కి దగ్గరౌతున్న భయం కనపడుతుంది .. అతను చేసిన నేరం ఒక దొంగతనం .. అతన్ని కొట్టడానికి అందరూ తోసుకువస్తున్నారు ... వాళ్ళలొ చిన్న పిల్లలు కూడ వున్నారు .. ఆ పిల్లల మొహం లొ అతన్ని కొట్టడానికి ఉత్సాహం స్పష్టం గా కనపడుతుంది.. చూస్తుండగానె ఒకడు బైక్ వెసుకుని వచ్చాడు , ఈ దొంగని ఆ బైక్ కి తాడు వేసి కట్టేసారు ..అలా ఆ వూరంతా తిప్పి మల్లి ఇక్కడికె తీసుకొచ్చారు.. చివరకి అందరు కలిసి అతన్ని కొట్టి చంపేశారు
కొద్ది సేపటికె టీవి చానెల్స్ లొ ప్రత్యక్ష ప్రసారం మొదలయ్యింది ...
మాట్లాడడం రాని ఒక ఏంకర్ ఇలా అందుకుంది .. " బిహార్ లొని మనుషుల ఆటవికతకు నిదర్శనం గా ఈ రోజు ఒక దారుణమైన సంఘటన జరిగింది .. దొంగతనం చేశాడన్న నెపం తో ఒక మనిషిని గ్రామస్తులు అందరు కలిసి అతి దారుణం గా...అతి కిరాతకం గా చంపెశారు " బీహార్ నుంచి కెమేరా మేన్ జక్కన్న తో సరిత
ఇంతలో
"అసలు బీహార్ లొ వున్నది మనుషులా లేక మృగాలా .. అసలు ఎమి జరుగుతుంది అక్కడ " -- ఒక మహా మేధావి ఆవేదన
"అక్కడి మనుషులను సంస్కరించాల్సిన అవసరం ఎంతైన వుంది" --ఒక మనవతా వాది పిలుపు
"సభ్య సమాజం తల దించుకోవలిసిన రోజు .. బీహార్ మన దేశం లొ చెడి పొయిన ఒక భాగం వంటిది .. నిర్మూలించండి" -- ఒక గుంపు లొ గొవిందయ్య సలహా..
ఇంత జరిగినా అక్కడి జనం కాని అధికారులు కాని పట్టించుకోలేదు ..ఇవేమి చూసి తట్టుకోలేక భరించలేక తిరిగి మన ఆంధ్రా వచ్చెయ్యలని ట్రైన్ ఎక్కేసా .. దారి పొడుగునా నాకు అవే అలోచనలు ..
మనుషుల్లొ కౄరత్వం అంటె ఇదే ఇదే .. ఇంత కన్నా భయంకరమైన మనుషులు ఎక్కడా వుండరు అని అనిపించింది..
మళ్ళి జన్మ లొ బీహార్ వెళ్ళను.. హా వెళ్ళను ..
మరునాడు నేను వున్న ట్రైన్ మన ఆంధ్ర లొకి ప్రవేశించింది...
సమయం : 9:30 , జనవరి 25, 2009
ప్రాంతం : వరంగల్ రైల్వే స్టేషన్
----------------------------------------------------------
ఎంత సేపు చూసినా ట్రైన్ కదలట్లేదు ... ఇంతలో పెద్ద పెద్ద కేకలు అరుపులు నినాదాలు ..ఏమిటో చూద్దామని ముందు వెళ్లి చూసా అక్కడ కొందరు ట్రైన్ కి అడ్డం వెళ్లి పడుకున్నారు పట్టాల మీద ...
"పోలీస్ జులుం నశించాలి .. పోలీస్ దౌర్జన్యం నశించాలి " అంటు అరుస్తున్నారు
అక్కడే వున్నఒకడిని అడిగా ఏమి జరిగిందని ?
"నిన్న ఒక ఆడ పిల్ల మీద ఒకడు ఆసిడ్ పోశాడు , వాడిని పోలీసులు రోజు ఉదయం కాల్చి చంపేశారు " అని చెప్పాడు
ఐతే పోలీసులు మంచి పనే చేసారు కదా మరి మీరు ఎందుకు ఆరుస్తున్నారు అని అడిగా ...
"పోలీసులు రూల్స్ ప్రకారం నడుచుకోలేదు .. ఆ ఆసిడ్ పోసిన నిందితుడి హక్కులను కాల రాసారు .. అతన్ని అన్యాయం గా చంపేశారు ఇది దుర్మార్గం ... సాటి మానవులు గా మేము అతని తరుపున ధర్నా చేస్తున్నాం .. మేము మనవ హక్కుల సంఘం ప్రతినిధులం " అంటు వీడు కూడా వెళ్లి పోయాడు
ఒక్క క్షణం నేను ఎక్కడ వున్నానా అనిపించింది ..ఖచ్చితం గా ఇది బిహార్ కాదు .. ఒక ఆడపిల్ల మీద ఆసిడ్ పోసిన వాడి కోసం వీళ్ళు ట్రైన్ కి అడ్డం పడుకుని నిరసన చేస్తున్నారా???!!!!! ..
వరంగల్ రైల్వే స్టేషన్ లో ఆ క్రూర మృగాల మధ్యలో గడిపిన అనుభవం వల్ల నాకు ఏంటో నిన్న చూసిన బీహార్ ఎ బాగుంది అనిపిస్తుంది .. వీళ్ళతో పోల్చుకుంటే అక్కడి జనం ఎంతో గొప్ప వారిలా కనిపిస్తున్నారు ...
వద్దు నేను మళ్ళి బిహార్ వెళ్ళిపోతా ... అక్కడ వుంటా .. ఆక్కడే వుంటా..
ఒక్క మాట మిత్రులారా ---
సమాజం, కట్టుబాట్లు ,న్యాయ వ్యవస్థ ఇవన్నీ మన కోసం మనం నిర్మించుకున్నాం కాని అవి మన నైతిక విలువలను కాపాడలేనపుడు వాటిని మార్చాలిసిన అవసరం ఎంతైనా వుంది ..నైతిక విలువలు లేనపుడు మన సమాజం లో ఎంత అభివృద్ధి చెందినా అది వృధానే .. న్యాయం కల్పించలేని ఇలాంటి మానవ హక్కులు మనకి వద్దు .. ఇలాంటి సమాజం లో వుంటున్న మనకి బీహార్ ని విమర్శించే హక్కు లేదు .. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం..
హక్కుల కోసం పోరాటాలు మాని బాధ్యతల కోసం నడుం కట్టి ముందు సాగుదాం .. తొండ ముదిరి వూసరవెల్లి అవుతుంది అలానే సామాజిక సృహ ఎక్కువైనా వాడు మానవ హక్కుల కార్యకర్త అవుతున్నాడు ..వీళ్ళు చేసే పని లేని పోరాటాలు వల్ల మన భాధ్యతలను మరువొద్దు
-----జై హింద్